
ఏసీపీఆర్‌ఈఈ పథకంపై అవగాహన
విశాఖ సిటీ: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఏసీపీఆర్‌ఈఈ–2025(స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్) పథకంపై బుధవారం హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ కార్యాలయంలో యజమానులు, ఉద్యోగులకు ఈఎస్‌ఐ ఉప ప్రాంతీయ అధికారులు, గాజువాక బ్రాంచ్ మేనేజర్ అవగాహన కల్పించారు. ఈ పథకంలో ఎవరైనా చేరకపోతే తక్షణమే చేరాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబరు 31 వరకు గడువు ఉందన్నారు. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉన్న కర్మాగారాలు, సంస్థలు సువిధ, ఎంసీఏ, ఈఎస్‌ఐసీ పోర్టళ్లలో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఈఎస్‌ఐ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.కె.సాహూ, అసిస్టెంట్ డైరెక్టర్ వి.శ్యామ్ ప్రసాద్, గాజువాక బ్రాంచ్ మేనేజర్ ఎల్.కృష్ణ ప్రసాద్, అసిస్టెంట్ డి.చిరంజీవి (అసిస్టెంట్), హిందూస్తాన్ షిప్‌యార్డ్ కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.