
గోవాడ సుగర్స్‌ను ఆదుకోవాలి
కె.కోటపాడు: గోవాడ సుగర్ ప్యాక్టరీని రాష్ట్రంలో గల కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని చెరకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేచలపు కాసుబాబు కోరారు. కె.కోటపాడులో బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ పరిస్థితులపై జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్‌ను ఇటీవల కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని కాసుబాబు అన్నారు. చెరకు రైతులకు రూ.30 కోట్లు, కార్మికులకు రూ.10 కోట్లు బకాయిలు ఉన్న విషయాన్ని ఫ్యాక్టరీ పరిధిలో గల ఇద్దరు ఎమ్మెల్యేలకు తెలిసినా వారు పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. ప్రస్తుత ఫ్యాక్టరీ దీన పరిస్థితిపై ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు స్పందించి పూర్వవైభవం వచ్చేలా సహకారాన్ని అందించాలని కాసుబాబు కోరారు. కార్యక్రమంలో కొరిబిల్లి శంకరరావు, గొర్లె దేముడుబాబు, శెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.