
అగ్రిసెట్‌లో ర్యాంకుల పంట
అనకాపల్లి టౌన్: స్ధానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానంకు అనుబంధంగా ఉన్న వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు 2025 అగ్రిసెట్ ప్రవేశ పరీక్ష రాష్ట్ర స్థాయి ఫలితాల్లో పలు ర్యాంకులు పొందినట్టు కళాళాల ప్రిన్సిపాల్, పరిశోధన స్ధానం ఏడీఆర్ డాక్డర్ ముకుందరావు తెలిపారు. ఎల్.స్వరూప 9వ ర్యాంకు, వి.గౌరీశ్వరి, 10వ ర్యాంకు, పి. వెంకటేష్, 19వ ర్యాంకు, జి.అనూష 43వ ర్యాంకులు సాధించగా 100లోపు ర్యాంకులు 24 మంది, మరో 12 మంది విద్యార్థులు పలు ర్యాంకులు సాధించినట్టు తెలిపారు. వీరిని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.చారులత, బోధన సిబ్బంది అభినందించారు.