
ఆన్‌లైన్ ఉద్యోగం పేరుతో మోసం...
● ఖాతాల నుంచి క్షణాల్లో మాయమవుతున్న డబ్బులు ● జిల్లాలో ఏడాది కాలంలో 94 సైబర్ కేసులు నమోదు ● ఇప్పటివరకు రూ. 94 లక్షలు ఫ్రీజ్ ● అచ్యుతాపురం కేంద్రంగా నకిలీ కాల్ సెంటర్ ● డిజిటల్ అరెస్ట్ చేస్తామని భయపెట్టి కోట్లలో దోపిడీ ● అప్రమత్తతే ఆయుధమంటున్న పోలీసులు
అనకాపల్లిలో గవరపాలేనికి చెందిన మణికంఠ అమెజాన్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. ఈ ఏడాది జనవరి 31న వాట్సాప్‌లో కంపెనీ పేరుతో ఒక లింక్ వచ్చింది. ఇది పార్ట్‌టైమ్ ఉద్యోగమని.. ఇంటిలో కూర్చునే డబ్బు సంపాదించుకోవచ్చని చెప్పడంతో రిజిస్ట్రేషన్ కోసం రూ.1,000లు ఫోన్‌పే చేశాడు. కొద్ది రోజుల్లోనే మణికంఠ ఖాతాలో రూ.1,400 జమ అయ్యాయి. దీంతో పార్ట్‌టైమ్ ఉద్యోగం బావుందని నమ్మిన ఆ యువకుడు నిర్వాహకులు చెప్పిన విధంగా దపదఫాలుగా రూ.1.80 లక్షలు పంపించాడు. తర్వాత అటునుంచి ఒక్క రూపాయీ రాలేదు. దీంతో మోసపోయానని గమనించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి మణికంఠ ఖాతా నుంచి వెళ్లిన డబ్బులో రూ.1.20 లక్షలు ఫ్రీజ్ చేశారు.