
ఏటికొప్పాక కళాకారుడికి లేపాక్షి పీపుల్స్ చాయిస్ అవార్
యలమంచిలి రూరల్: లేపాక్షి సావనీర్ హ్యాండీక్రాఫ్ట్ డిజైన్–2025 పోటీల్లో జిల్లాకు చెందిన ఏటికొప్పాక హస్తకళాకారుడు పెదపాటి సుబ్రహ్మణ్యం ఏసుదాసు పీపుల్స్ చాయిస్ అవార్డ్ దక్కించుకున్నారు. ఇటీవల రాష్ట్ర లేపాక్షి హస్తకళలు, ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారులు తమ నైపుణ్యంతో రూపొందించిన కళాకృతులను ప్రదర్శించారు. వీటిలో ఏటికొప్పాకకు చెందిన ఏసుదాసు ప్రదర్శించిన లక్కబొమ్మలతో తయారుచేసిన పచ్చదనం వెర్సస్ కాలుష్య నియంత్రణ కళాఖండానికి ఈ అవార్డు లభించింది. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ శ్రీవిశ్వ నుంచి ఏసుదాసు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఏటికొప్పాక జెడ్పీటీసీ సేనాపతి సంధ్యారాణి, వైఎస్సార్‌సీపీ నాయకుడు సేనాపతి రాము, పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు ఏసుదాసును అభినందించారు.