
హెటెరో గొడౌన్‌లో తనిఖీలు
తనిఖీలు చేస్తున్న యూఎస్ అధికారులు
నక్కపల్లి: మండలంలో వెదుళ్లపాలెం సమీపంలో నిర్వహిస్తున్న హెటెరో గోదాముల్లో యూఎస్ ఎఫ్‌డీఏ బృందాలు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశాయి. ఇక్కడ కంపెనీ వారు అద్దె గృహాన్ని తీసుకుని ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిసింది. ఎటువంటి నేమ్ బోర్డు లేకుండా ఉన్న ఈ గోదామును, ట్రైనింగ్ సెంటరును ఢిల్లీ నుంచి వచ్చిన యూఎస్ ఎఫ్‌డీఏ బృందాలు పరిశీలించాయి. కొన్నేళ్ల క్రితం గోదాములను నిర్మించారు. అక్కడ కొన్ని ఔషధాలను ఉంచినట్లు బోగట్టా. ఈ గోదాములను కూడా ఈ బృందాలు పరిశీలించాయి. యూఎస్ డ్రగ్ బృంద అధికారి అక్తర్ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నట్లు సమాచారం.