
అమరజీవి ఆశయ సాధనకు కృషి చేయాలి
పొట్టి శ్రీరాములు మేనల్లుడు
గునుపూడి వెంకట సత్యనారాయణ
అనకాపల్లి: నేటి యువత అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన మేనల్లుడు గునుపూడి వెంకట సత్యనారాయణ కోరారు. స్థానిక మెయిన్‌రోడ్డులో అమరజీవి పొట్టి శ్రీరాములు భవనం 24వ వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదవడం వల్ల ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు శ్రీరాములు ప్రాణత్యాగం గురించి వివరించారు. అనంతరం పట్టణంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, మహిళా కళాశాల విద్యార్థినులకు 3 వేలు నోట్ పుస్తకాలను, పెన్నులు ఉచితంగా పంపిణీ చేశారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పి.వి.ఎం.నాగజ్యోతిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పోట్టి శ్రీరాములు భవన నిర్మాణ వ్యవస్థాపకుడు పిరాట్ల నరసింహామూర్తి, సభ్యులు కాండ్రేగుల దుర్గాప్రసాద్‌రావు, కాండ్రేగుల సత్యనారాయణ, గంగుపాము నాగేశ్వరరావు, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు లావణ్య, కార్యదర్శి ఉమ, కో ఆర్టినేటర్ మంజు భార్గవి, తదితరులు పాల్గొన్నారు.