
అపర భగీరథుడు
నక్కపల్లి/నాతవరం: భారీగా వర్షాలు, వరదలు వచ్చిన సమయంలో సముద్రంలోకి వృథాగా పోతున్న తాండవ నీటిని సాగు కోసం ఉపయోగించాలనే తపనతో వైఎస్సార్ పాయకరావుపేటలో రూ.8 కోట్లతో మినీ ఆనకట్టలు నిర్మించారు. మహానేత మరణించి 16 ఏళ్లు గడచినప్పటికీ ఆయన అందించిన జలప్రసాదంతో నియోజకవర్గంలో రైతులకు ఖరీఫ్, రబీల్లో కూడా వరి, తమలపాకు, అరటి తదితర ఉద్యాన వన పంటలకు సాగునీరు పుష్కలంగా అందుతోంది. 40 ఏళ్లుగా ఈ ప్రాంత రైతులు ఆశిస్తున్న తాండవ జలాలను భూమి, ముఠా, ఆవ, మంగవరం గ్రోయిన్‌ల ద్వారా విడుదల చేయించారు. పాయకరావుపేట వాటాకు రావాల్సిన 35 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించేందుకు ప్రత్యేక జీవో తెచ్చారు. అలాగే నాతవరం మండలంలోని తాండవ రిజర్వాయరు ప్రధాన పంట కాలువలకు సిమెంటు లైనింగ్ పనులు చేయించారు. పంట కాలువల అభివృద్ధి కోసం రూ.55 కోట్లు వెచ్చించారు. 120 కిలోమీటర్ల పొడవున సిమెంటు లైనింగ్ పనులు చేయడంతో శివారు ఆయకట్టుకు సైతం పుష్కలంగా సాగునీరు సరఫరా అవుతోంది.
పాయకరావుపేటలో తాండవ నదిపై నిర్మించిన మినీ బ్యారేజీ
సిమెంట్ లైనింగ్ పనులతో కాలువలో నిండుగా ప్రవహిస్తున్న తాండవ నీరు

అపర భగీరథుడు