
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ పిలుపు
విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడదాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ పిలుపు
సాక్షి, అనకాపల్లి: మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా జిల్లాలో వాడవాడలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ్ అమర్‌నాథ్ పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా అనకాపల్లి టౌన్‌లో రింగురోడ్డులోని పార్టీ కార్యాలయంతో పాటుగా ఆయా నియోజకవర్గాల పరిధిలో సమన్వయకర్తలు, పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు మహానేతకు ఘన నివాళులర్పించాలన్నారు.
అలాగే వైఎస్సార్ విగ్రహాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రక్తదానం, అన్నసమారాధన, పండ్లు, రొట్టెల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి, అనకాపల్లి జిల్లాకు ఆయన చేసిన సేవలను స్మరించుకుందామన్నారు.