
దిగి వచ్చిన సర్కార్
దివ్యాంగులకు యథావిధిగా పింఛన్ల బట్వాడా
మాడుగుల రూరల్/కోటవురట్ల: దయలేని కూటమి సర్కార్ దిగి వచ్చింది. కదలలేక దయనీయ స్థితిలో ఉన్న దివ్యాంగులు.. పాతిక, ముప్ఫై ఏళ్లకు పైగా పింఛన్ అందుకుంటున్న వారు.. నిబంధనల ప్రకారం 40 శాతం వైకల్యం దాటి 60.. 80 శాతానికి పైగా సమస్య ఉన్న వారిని సైతం అనుమానిస్తూ, అవమానిస్తూ, దొంగ సర్టిఫికెట్లని కించపరుస్తూ పెన్షన్ నిలిపివేస్తున్నట్టు నోటీసులిచ్చారు. వారి కష్టం కనిపిస్తున్నా కనికరించలేదు. ఆ విధి వంచితుల వ్యధను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ప్రధాన సంచికలో పలువురు బాధితుల కథనాలతోపాటు జిల్లా సంచికలో ‘దివ్యాంగుల గోడు’ శీర్షికతో వారి ఆవేదనను అక్షరీకరించింది. మాడుగుల మండలం కె.జె.పురం గ్రామానికి చెందిన భీశెట్టి కృష్ట, కోటవురట్ల మండలానికి చెందిన గూడె గౌరి, శెన్నంశెట్టి భువనేశ్వరి, సన్నివాడ ప్రవీణ్ తదితరుల కన్నీటి కథలను వెలుగులోకి తెచ్చింది. ప్రజల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తి, ఆగ్రహావేశాలను గమనించిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం సోమవారం ఎలాంటి కోత లేకుండా దివ్యాంగులందరికీ పింఛన్లు అందించింది. దీంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు.

దిగి వచ్చిన సర్కార్

దిగి వచ్చిన సర్కార్