కోటవురట్ల: ట్రాక్టరు కింద పడి సుర్ల లోవరాజు(30) అనే యువకుడు దుర్మరణం చెందాడు. కొడవటిపూడి శివారు చెరకు కాటా సమీపంలో సోమవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కె.వెంకటాపురానికి చెందిన సుర్ల లోవరాజు, పోతురాజు శ్రీను కలిసి బైక్‌పై స్వగ్రామం వెళుతున్నారు. కొడవటిపూడి చెరకు కాటా సమీపంలోకి వచ్చేసరికి ముందు వెళుతున్న ఆయిల్‌పామ్ లోడు ట్రాక్టరును తప్పించే క్రమంలో బైక్ గోతిలోపడి అదుపు తప్పింది.
బైక్ నడుపుతున్న శ్రీను రోడ్డు పక్కన పొలాల్లో తూలిపడిపోగా, వెనుక కూర్చున్న లోవరాజు ట్రాక్టరు వెనుక చక్రం కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మండల కేంద్రంలోని సీహెచ్‌సీకి తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పైల రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

లోవరాజు మృతదేహం, లోవరాజు (ఫైల్)