నర్సీపట్నం: గంజాయి తరలిస్తున్న ఇద్దర్ని టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. టౌన్ సీఐ జి.గోవిందరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముందుస్తుగా అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు, సిబ్బందితో కలిసి మంగళవారం ఆర్టీసీ కాంప్లెక్స్ ఔట్ గేటు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. బైక్‌పై వస్తున్న హైదరాబాద్‌కు చెందిన యలమంచలి వివేక్, కాకినాడకు చెందిన ఉయ్యాల సాయిచరణ్‌ను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ఆరున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరికి పైలెట్‌గా వ్యవహరించిన అల్లూరి జిల్లా హుకుంపేటకు చెందిన బాలుడిని అదుపులోకి తీసుకుని, జువైనల్ హోంకు తరలించామని సీఐ తెలిపారు. రెండు వాహనాలు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.