
ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు
కె.కోటపాడు: గొండుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయాలజీ(జీవశాస్త్రం) ఉపాధ్యయునిగా పని చేస్తున్న ఎల్.వి.నారాయణరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయని పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం సాయంత్రం ప్రకటించిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులలో నారాయణరావు ఒకరుగా ఉన్నారు. పాఠశాలలో ఉత్తమ విద్యాబోధనను అందించడమే కాకుండా పాఠశాలలో సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ నారాయణరావు ముందుంటారు. ఈ అవార్డును ఈ నెల 5న అమరావతిలో నారాయణరావు అందుకోనున్నారు.
సంఘమిత్ర, సిరి ఫౌండేషన్ ద్వారా సేవలు..
కె.కోటపాడు కేంద్రంగా డాక్టర్ బండారు రామచంద్రరావు స్థాపించిన సంఘమిత్ర రూరల్ డవలప్‌మెంట్ సొసైటీలో సభ్యునిగా, సిరి ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యునిగా ఉపాధ్యాయుడు నారాయణరావు సేవలను అందిస్తున్నారు. ఈ సొసైటీల ద్వారా 2010 నుంచి ఉచిత వైద్య శిబిరాలు, పేద విద్యార్థులకు చేయూత, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, గ్రంథాలయాలు, క్రీడా మైదానాల్లో మౌలిక వసతులను కల్పన వంటి సేవలు అందించారు. ఆయన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల మండల విద్యాశాఖాధికారులు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
ఉపాధ్యాయ నేతకు పురస్కారం
నర్సీపట్నం : పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. నర్సీపట్నం శివపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (మెయిన్)లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి గాను ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. అవార్డుకు ఎంపిక కావడం పట్ల పలువురు ఉపాధ్యాయులు, పీఆర్‌టీయు నర్సీపట్నం మండలం తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు.
రోలుగుంట: మండల కేంద్రం రోలుగుంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పని చేస్తున్న పి.వి.ఎం.నాగజ్యోతి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి ఆమెకు ప్రొసీడింగు కాపీ అందినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవార్డుకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఈ అవార్డుతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. విద్యార్థులు సబ్జెక్టులో పట్టు సాధించేలా వారిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఆనేక వినూత్న కార్యక్రమాలను రూపొందించి అమలు పరచడంలో ఆమె విజయాలు సాధిస్తున్నారు. పురస్కారానికి ఎంపికైన ఆమెను పలువురు అభినందించారు.
ఎల్.వి.నారాయణరావు
నాగజ్యోతి
డి.గోపీనాథ్

ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు

ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు