
ముక్తకంఠంతో వ్యతిరేకించినా తీసుకోమని తీవ్ర ఒత్తిడి
మునగపాక మండలం తిమ్మరాజుపేటలో నాకున్న 64 గజాలు పోతుంది. ఇందుకు పరిహారంగా టీడీఆర్ బాండ్లు తీసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. బడా కంపెనీల కోసం రైతు నష్టపోవాలా..? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిర్వాసితులమంతా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రామ సభ నిర్వహించారు. నిర్వాసితులమంతా టీడీఆర్ బాండ్లు వద్దంటూ ముక్త కంఠంతో వ్యతిరేకించాం. మళ్లీ టీడీఆర్ బాండ్లు ఇస్తామంటున్నారు. ఇదెక్కడి న్యాయమో అర్థం కావడం లేదు.
– శొంఠ్యాన బ్రహ్మాజీ, మునగపాక మండలం, తిమ్మరాజు పేట