
డీఎస్‌ఎన్‌ఎల్‌యూలో అకడమిక్ బ్లాక్ ప్రారంభం
సబ్బవరం: దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం(డీఎస్‌ఎన్‌ఎల్‌యూ)లో నూతనంగా నిర్మించిన అకడమిక్ బ్లాక్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తి, విశ్వవిద్యాలయ విజిటర్ జస్టిస్ పి.శ్రీనరసింహ శుక్రవారం ప్రారంభించారు. దీంతోపాటు వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహత్మాగాంఽధీ, రాజ్యాంగ పిత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, తొలి దళిత ముఖ్యమంత్రి, దామోదరం సంజీవయ్య విగ్రహాలను హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వర్సిటీ సమావేశమందిరంలో వాతావరణ మార్పులు, చట్టాలు అనే అంశంపై జస్టిస్ ఇ.వెంకటేశం స్మారక ఉపన్యాసం చేశారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డాక్టర్ సూర్యప్రకాశరావు, ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ విశ్వచంద్ర మదాసీ పాల్గొన్నారు.