
ఎరుకలమ్మకు పదోన్నతి
గొలుగొండ: కృష్ణదేవిపేట రేంజ్ పరిధిలో ఫారెస్టు బీట్ ఆఫీసర్‌గా పనిచేసిన ఎరుకులమ్మకు పదోన్నతి వచ్చింది. ఆమె ఫారెస్టు సెక్షన్ అధికారిగా పదోన్నతి పొందినట్లు కృష్ణదేవిపేట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ తెలిపారు. ఇక్కడ మూడు సంవత్సరాలకు పైగా ఫారెస్టు బీట్ ఆఫీసర్‌గా పనిచేసిన ఎరుకులమ్మ అటవీ పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతోనే త్వరగా పదోన్నతి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఫారెస్టు సెక్షన్ అధికారిగా చింతపల్లిలో ఆమె విధులు నిర్వహించనున్నారు.
13 వరకు విశాఖ–బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ రద్దు
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ పెందుర్తి–సింహాచలం పరిధిలో జరుగుతున్న భద్రతా పనుల కారణంగా ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఈ నెల 6, 8, 10, 12వ తేదీల్లో విశాఖపట్నం–బ్రహ్మపూర్(18526) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 7, 9, 11, 13వ తేదీల్లో బ్రహ్మపూర్–విశాఖపట్నం(18525) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 7, 9, 11, 13వ తేదీల్లో విశాఖపట్నం–విజయనగరం(67287) పాసింజర్‌ను రద్దు చేశారు. ఈ నెల 7, 9, 11, 13వ తేదీల్లో పలాస–విశాఖపట్నం (67290) పాసింజర్ విజయనగరం వరకు మాత్రమే నడుస్తుంది.
‘బొకారో’దారి మళ్లింపు.. అదనపు హాల్ట్
సదరన్ రైల్వే, సేలం డివిజన్ పరిధిలో జరుగుతున్న భద్రతా పనుల వల్ల ఈ నెల 7న అలప్పుజ–ధన్‌బాద్(13352)బొకారో ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించినట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఆ తేదీన ఈ రైలు వయా పొదనూర్ జంక్షన్–ఇరుగూర్ జంక్షన్, సేలం మీదుగా ప్రయాణిస్తుంది.ప్రయాణికుల సౌకర్యార్థం పొదనూర్‌లో అదనపు హాల్ట్ కూడా కల్పించారు.
హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్‌కు తాత్కాలిక హాల్ట్
నార్తర్న్ రైల్వే, ఢిల్లీ డివిజన్ పరిధిలోని భోద్వాల్ మజ్రిలో జరగనున్న 78వ వార్షిక అంతర్జాతీయ నిరంకారీ సంత్ సమాగం కారణంగా హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ స్టేషన్‌లో తాత్కాలిక హాల్ట్ కల్పించారు. అక్టోబరు 19 నుంచి నవంబరు 7 వరకు ఈ తాత్కాలిక హాల్ట్ ఉంటుంది. అమృత్‌సర్–విశాఖపట్నం (20808) హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ భోద్వాల్ మజ్రి స్టేషన్‌కు ఉదయం 5.52 గంటలకు చేరుకుని, 5.54 గంటలకు బయలుదేరుతుంది. అలాగే, విశాఖపట్నం–అమృత్‌సర్ (20807) హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 3.48 గంటలకు చేరుకుని, 3.50 గంటలకు బయలుదేరుతుంది.