
కమిషనర్‌కు వినతి ఇస్తే.. సమాధానమే లేదు
మాకు టీడీఆర్ బాండ్లు వద్దు.. నష్ట పరిహారంగా నగదు ఇవ్వాలి. 2023లో గ్రామాల వారీగా ధర నిర్ణయించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నష్ట పరిహారం ఇవ్వడానికి అంతా సిద్ధం చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ జీవో రద్దు చేశారు. గత నెల 31న టీడీఆర్ బాండ్లు ఇస్తామంటూ జీవో ఇచ్చారు. వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ను కలిసి టీడీఆర్ బాండ్లు వద్దు అని కోరాం. మాకు సంబంధం లేదని సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.
– కర్రి అప్పారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, తిమ్మరాజు పేట, అచ్యుతాపురం మండలం