
పోస్టల్ ఉద్యోగుల క్రికెట్ మ్యాచ్
పోస్టల్ శాఖ ఉద్యోగులు డైట్ కళాశాలలో క్రికెట్ ఆడుతున్న దృశ్యం
అనకాపల్లి : క్రీడల ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని డైట్ కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ అన్నారు. స్థానిక జాతీయ రహదారి డైట్ కళాశాలలో పోస్టల్ శాఖ ఉద్యోగుల ఒక రోజు క్రికెట్ మ్యాచ్‌ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తపాల శాఖ ఉద్యోగులు ప్రతి ఏడాది క్రికెట్ మ్యాచ్‌లు అడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోస్టల్ ఉద్యోగులు మానసిక ప్రశాంతతకు క్రికెట్ ఆడడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. తపాలశాఖ యూనియన్ రీజియన్ అధ్యక్షుడు వై.బి.పలాసరావు మాట్లాడుతూ క్రీడల వలన మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. సుమారుగా 100 మంది క్రీడాకారుల పాల్గొడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తపాలశాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.