జీ కోడూరు క్వారీ లీజు రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

జీ కోడూరు క్వారీ లీజు రద్దు చేయాలి

Jul 14 2025 4:47 AM | Updated on Jul 14 2025 4:47 AM

జీ కోడూరు క్వారీ లీజు రద్దు చేయాలి

జీ కోడూరు క్వారీ లీజు రద్దు చేయాలి

ఆందోళన చేస్తున్న చిరంజీవి తదితరులు

మాకవరపాలెం: పంటలకు నష్టం కలిగించే క్వారీ లీజును రద్దు చేయాలని కులవ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి డిమాండ్‌ చేశారు. కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో జీకోడూరులో ఆదివారం రాత్రి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీకోడూరు రెవెన్యూలోని 332 సర్వే నంబర్‌లో 24 హెక్టార్లలో నల్లరాతి క్వారీ నిర్వహణకు లీజులు ఇచ్చారన్నారు. ఈ క్వారీ కారణంగా పక్కనే ఉన్న దళితుల భూములకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. క్వారీని నిర్వహించొద్దని ఇక్కడి దళిత రైతులు ఆందోళనలు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వారంతా శాంతియుతంగా నిరసన తెలిపేందుకు క్వారీ వద్ద వేసుకున్న పాకను ఈ తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారని, దీనిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement