ఉపాధి @ఐటీఐ | - | Sakshi
Sakshi News home page

ఉపాధి @ఐటీఐ

Jul 14 2025 4:47 AM | Updated on Jul 14 2025 4:47 AM

ఉపాధి

ఉపాధి @ఐటీఐ

కంచరపాలెం: ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)ల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు త్వరగా ఉపాధి పొందే కోర్సుల్లో ఐటీఐ ఒకటి. వీరికి వృత్తి పరమైన ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. ప్రధానంగా జిల్లా విద్యార్థులు ఇంటర్మీడియట్‌, పాలిటెక్నిక్‌తోపాటు ఐటీఐ చదివేందుకు అధిక ప్రాధాన్యమిస్తారు. వివిధ ట్రేడుల్లో ఐటీఐ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులు అప్రంటీస్‌ తర్వాత 18 ఏళ్లు నిండాక పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. డాక్‌యార్డ్‌, ఆర్టీసీ, షిప్‌యార్డ్‌, రైల్వే, విద్యుత్‌, రక్షణ శాఖ వంటి వాటిల్లో సైతం ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. చదువులో ఒత్తిడి ఉండదు. ఆయా పరిశ్రమలు, సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే విద్యార్థులకు సాంకేతిక రంగంపై స్కిల్స్‌ తప్పనిసరిగా ఉండాలి. నైపుణ్యం ఉన్న వారికి తప్పకుండా ఉపాధి లభిస్తుంది. మరోవైపు స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్య అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఉద్యోగం, ఉపాధితోపాటు స్వయం ఉపాధికి సైతం ఈ కోర్సులు ఎంతగానో దోహదపడతాయి.

22 ట్రేడ్‌ల్లో శిక్షణ

విశాఖ జిల్లా పరిధిలో నాలుగు ప్రభుత్వ, 31 ప్రైవేట్‌ ఐటీఐల్లో 3,286 సీట్లు ఉన్నాయి. ఏడాది, రెండేళ్ల వ్యవధి ఉన్న 22 ట్రేడ్‌ కోర్సులు నిర్వహిస్తున్నారు. కొన్ని ట్రేడ్‌ల్లో 8వ తరగతి విద్యార్హతతో శిక్షణ ఇస్తున్నారు. అభ్యర్థుల సంఖ్యకు తగ్గట్టుగా ప్రభుత్వ ఐటీఐల్లోని పలు ట్రేడ్‌ల్లో సీట్ల సంఖ్య పెరిగితే అధికంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని పలువురు సూచిస్తున్నారు.

ఏడాది కోర్సులు

ప్లంబర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌(కోపా), కార్పెంటర్‌, మెకానికల్‌ డీజిల్‌, పీపీవో, స్టెనోగ్రఫీ, వెల్డర్‌.

రెండేళ్ల కోర్సులు

ఏవో కెమికల్‌, డీఎం సివిల్‌, డీఎం మెకానికల్‌, ఫిట్టర్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ మెకానికల్‌, మెకనిస్ట్‌, ఐసీ అండ్‌ టీఎస్‌ఎం, టర్నర్‌, ఆర్‌ అండ్‌ ఏసీ మెకానిక్‌, ఎంఎంటీఎం, పెయింటర్‌(జి), ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్‌ మెకానికల్‌, ఐఎం కెమికల్‌, మెషినిస్ట్‌ మెకానిక్‌(ఎంఎం).

15 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌

ప్రభుత్వ, ప్రైవేట్‌ పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తయింది. మిగులు సీట్ల కోసం ఈ నెల 15 నుంచి ప్రభుత్వ ఐటీఐల్లో రెండో విడత కౌన్సెలింగ్‌ జరగనుంది. ఆసక్తి గల విద్యార్థులు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని సమీపంలోని ఐటీఐకు వెళ్లి పలు ట్రేడ్‌ల్లో చేరవచ్చు. జూలై నెలాఖరు తేదీ లోపు ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆగస్టు మొదటి వారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి.

సంప్రదించాల్సిన ఐటీఐలు పాత ఐటీఐ, కంచరపాలెం

న్యూ ఐటీఐ, గాజువాక

ఐటీఐ, నరవ

బాలికల ఐటీ, కంచరపాలెం ఇండస్ట్రియల్‌ ఏరియా

ఏడాది కోర్సులు 7

రెండేళ్ల కోర్సులు 15

ప్రభుత్వ ఐటీఐల్లో సీట్లు 1,648

ప్రైవేట్‌ ఐటీఐల్లో సీట్లు 1,638

మొత్తం 35 ఐటీఐల్లో సీట్లు 3,286

వైబ్‌సైట్‌ iti.ap.gov.in

పారిశ్రామిక వృత్తి విద్య శిక్షణతో మెండుగా ఉపాధి అవకాశాలు

ఐటీఐల్లో చురుగ్గా ప్రవేశాలు

పలు ట్రేడుల్లో అభ్యర్థుల చేరిక

అందుబాటులో మిగులు సీట్లు

ఉపాధి @ఐటీఐ 1
1/2

ఉపాధి @ఐటీఐ

ఉపాధి @ఐటీఐ 2
2/2

ఉపాధి @ఐటీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement