
రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో శ్రావ్యశ్రీ ప్రతిభ
రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన శ్రావ్యశ్రీకి మెమెంటో అందజేస్తున్న దృశ్యం
ఎస్.రాయవరం : రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్‌షిప్‌లో ఎస్.రాయవరం గ్రామానికి చెందిన భీమరశెట్టి శ్రావ్యశ్రీ ప్రథమ స్థానంలో నిలిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. విశాఖపట్నం బీవీకె కళాశాలలో ఈ నెల 12,13 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్ 15 బాలికల చదరంగలో రాష్ట్ర వ్యాప్తంగా 99 మంది పాల్గొన్నారని, అందులో ఎస్.రాయవరానికి చెందిన శ్రావ్యశ్రీ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ మేరకు శ్రావ్యశ్రీని కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, స్నేహితులు అభినందించారు.