
రేషన్ కోసం 13 కి.మీ. నడక
రావికమతం: రేషన్ సరకుల కోసం 13 కిలోమీటర్లు నడుస్తున్నామని, జెడ్.జోగుంపేట కేంద్రంగా జీసీసీ డిపో ఏర్పాటు చేయాలని చీమలపాడు పంచాయతీ గిరిజనులు డిమాండ్ చేశా రు. కావిడిలో సరకులు మోస్తూ వారు శుక్రవా రం నిరసన తెలియజేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ విధానానికి కూటమి సర్కార్ మంగళం పాడటంతో చీమలపాడు గిరిజనులు తీవ్ర అ వస్థలు పడుతున్నారు. సరైన రోడ్డు సదుపా యం లేకపోవడంతో తలపై రేషన్ సరకుల మూట మోస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. ఈ పంచాయతీ పరిధిలో కల్యాణపులోవ గ్రామంలో జీసీసీ రేషన్ డిపో ఉంది. దీని పరిధిలో జెడ్.జోగుంపేట, పెదగురువు, రాయపాడు, రొచ్చుపణుకు, తాటిపర్తి, గంగంపేట, నేరెడుబంద, అజేయపురం, కడగడ్డ, బంగారుబందలు గ్రా మాలున్నా యి. 612 కార్డులు కలిగిన లబ్ధిదారులున్నారు. వీరు కాలినడకన కొండలు, వా గులు, గుట్టలు దాటుకొని 13 కిలోమీటర్లు న డిచి కల్యాణపులోవ వచ్చి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తోంది. జెడ్.జోగుంపేట కేంద్రంగా జీసీసీ పాయింట్ ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు డిమాండ్ చేశారు.