
దివ్యాంగుల బోసి గేమ్ కోచ్‌గా మహాలక్ష్మినాయుడు
రావికమతం: జాతీయ స్థాయి దివ్యాంగుల బోసి గేమ్ క్రీడా పోటీల్లో రాష్ట్ర బాలుర జట్టుకు కోచ్‌గా మేడివాడ జెడ్పీ హైస్కూల్ అసిస్టెంట్ ప్రత్యేక ఉపాధ్యాయుడు మహాలక్ష్మినాయుడును నియమించారు. జాతీయ స్థాయి స్పెషల్ ఒలింపిక్ భారత్ బోసి గేమ్ క్రీడా పోటీలు ఈ నెల 24 నుంచి 28 వరకూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బిలాస్‌పూర్‌లో జరగనున్నాయి. రాష్ట్రం నుంచి బోసీ గేమ్ పోటీలకు బాలురు విభాగంలో ఆరుగురు, బాలికల విభాగంలో ఆరుగురు ఎంపికయ్యారు. ఏపీ నుంచి పాల్గోనే బాలికల జట్టులో కొమిర గ్రామానికి చెందిన నక్కరాజు బాల సరస్వతి ఎంపికయ్యారు. దివ్యాంగుల బాలుర విభాగంలోని ఆరుగురు క్రీడాకారులకు మహాలక్ష్మినాయుడు శిక్షణ ఇవ్వనున్నారు. కోచ్‌గా ఎంపికై న మహాలక్ష్మినాయుడును మేడివాడ జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం వంకాయల రామారావు, ఉపాధ్యాయులు అభినందించారు.