
ఉద్యోగుల సమస్యలపరిష్కారానికి చర్యలు
తుమ్మపాల: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.వి.ఎస్. సుబ్బలక్ష్మి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఉద్యోగుల సమస్యలపై నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆమెతోపాటు కలెక్టరేట్ పరిపాలన అధికారి టి.విజయ్ కుమార్ పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ఈ వారం ఉద్యోగుల గ్రీవెన్స్ డేలో 8 అర్జీలు నమోదయ్యాయి. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.