‘పేట’ ప్రజలకు టీడీపీ వెన్నుపోటు! 'నీటి మీద రాతలు'గా హామీలు..

- - Sakshi

ఎన్నికల ముందు హామీలిచ్చి గెలిచాక పట్టించుకోని నేతలు!

టీడీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలకే పరిమితం!

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.1,550 కోట్లతో సంక్షేమం, రూ.578.4 కోట్లతో అభివృద్ధి పనులు

సాక్షి, అనకాపల్లి: 'హామీలంటే.. టీడీపీ అధినేత చంద్రబాబుకు కేవలం ప్రజలను నమ్మించే మాయమాటలే.. ఓట్లు రాల్చుకోవడానికి ఉపయోగపడే ఓటి మాటలే. ఎడాపెడా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయకుండా ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు మహా నేర్పరి. మేనిఫెస్టో అంటే టీడీపీకి టిష్యూ పేపర్‌తో సమానం. పాయకరావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, నిర్మాణాలు చేపడతామని 2014 ఎన్నికల ముందు టీడీపీ హామీ ఇచ్చింది. ఆ మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు అధికారంలోకి వచ్చిన తరువాత వెన్నుపోటు పొడిచింది. ఆ హామీలన్నింటినీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలోనే అమలుచేసింది.'

2014 ఎన్నికల్లో ఎడాపెడా హామీలిచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో హామీలను నెరవేర్చకుండా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలను నిలువునా మోసం చేశారు. అభివృద్ధిని కేవలం శిలాఫలకాల ఆవిష్కరణలకే పరిమితం చేశారు. టీడీపీ హయాంలో రూ.92 కోట్లతో పనులు చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేకపోయారు. ఆ పనులను వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక చేసి చూపించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పాయకరావుపేట నియోజకవర్గంలో హామీలిచ్చి, నెరవేర్చలేని వాటిని పూర్తిచేయడంతో పాటు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.1,550 కోట్ల సంక్షేమం, రూ.578.4కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసింది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సంక్షేమాభివృద్ధి పనులు
► పాయకరావుపేట నియోజకవర్గంలో డీబీటీ, నాన్‌ డీబీటీలో 29 సంక్షేమ పథకాలకు ప్రభుత్వం రూ.1,550 కోట్లు ఖర్చుచేసింది.
► ప్రతి గ్రామంలో అర్హులకు రూ.20 కోట్లకు పైగా లబ్ధి చేకూర్చింది.
► గడప గడపలో మన ప్రభుత్వం కార్యక్రమం కింద పనులకు రూ.24 కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ.16 కోట్లు, జల్‌ జీవన్‌ మిషన్‌కు రూ.200 కోట్లు, నాడు–నేడు పనులకు రూ.106 కోట్లు కేటాయించి, పనులు పూర్తి చేశారు. నాడు–నేడులో 136 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు.
► రూ.8.40 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునికీకరించారు.
► 9 వేల మంది పేదలకు రూ.200 కోట్లకు పైగా విలువైన ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అందులో భాగంగానే పాయకరావుపేటలో 42 ఎకరాల్లో మెగా లేఅవుట్‌ ఏర్పాటు చేసి 1,420 మందికి ఒకే చోట ఇళ్ల స్థలాలు కేటాయించారు.
► రూ.24 కోట్లతో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు మంజూరు చేశారు.

తాజాగా మంజూరు చేసినవి
► 1,100 ఎకరాల్లో డ్రగ్‌ పార్కు
► నక్కపల్లి మండలం రేబాక నుంచి కోటవురట్ల మండలం అల్లుమియాపాలెం వరకూ 10 కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.8 కోట్లు

టీడీపీ హయాంలో నెరవేర్చని..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పూర్తి చేసిన పనులు

► పాయకరావుపేట టౌన్‌లో వై జంక్షన్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకూ 2 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తామని టీడీపీ ప్రభుత్వంలో హామీ ఇచ్చారు. ఆ హామీ కేవలం మాటలకే పరిమితమైంది. 2014 నుంచి 2019 వరకూ ఐదేళ్ల పాటు రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే ఈ రోడ్డును విస్తరించడానికి నిధులు మంజూరు చేస్తే.. స్థానిక టీడీపీ నాయకులతో న్యాయస్థానంలో కేసు వేయించి ఆటంకం కలిగించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు చొరవతో పాత టెండర్‌తో పనిలేకుండా కొత్తగా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. రూ.2.95 కోట్లతో 2 కి.మీ. మేర రోడ్డు నిర్మాణం చేపట్టారు.

► నక్కపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని 2014లో టీడీపీ హామీ ఇచ్చింది. శిలాఫలకాన్ని ఆవిష్కరించి, విస్మరించింది. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. 28 మంది అధ్యాపకులను పూర్తిస్థాయిలో నియమించారు.

► టీడీపీ హయాంలో నక్కపల్లిలో సీహెచ్‌సీని 50 పడకలఆస్పత్రిగాఅప్‌గ్రేడ్‌ చేస్తామని హామీ ఇచ్చా రు. కనీసం శంకుస్థాపన కూడా చేసిన పాపానపోలేదు. 20పడకలున్న సీహెచ్‌సీని 50పడకల ఆస్ప త్రిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్‌గ్రేడ్‌ చేయ డంతో పాటు, రూ.3 కోట్లతో మౌలికసదుపాయ లు, ఆధునిక ల్యాబ్‌, హృద్రోగాలకు సంబంధించి అధునాతన టెక్నాలజీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.

► టీడీపీ ప్రభుత్వంలో పాయకరావుపేటలో ఉన్న పీహెచ్‌సీకి కొత్త భవనాన్ని నిర్మిస్తామని, మంగవరం పీహెచ్‌సీని ఆధునికీకరిస్తామని హామీలు గుప్పించారు. దాన్ని కూడా ఐదేళ్లలో పూర్తిగా టీడీపీ నిర్లక్ష్యం చేస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.1.30 కోట్లతో నూతన భవనాలు నిర్మించి, 2023 ఏడాదిలో ప్రారంభించింది. మంగవరం పీహెచ్‌సీనీ రూ.77 లక్షలతో ఆధునికీకరించింది.

► నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామంలో వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు 2009లో మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రూ.26 కోట్లతో శ్రీకారం చుట్టారు. అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం, 2014లో టీడీపీ ప్రభుత్వం రూ.50 కోట్లతో నిర్మాణానికి శిలాఫలకాలు ఏర్పాటుచేశాయి. పనులు ప్రారంభించి అర్ధాంతరంగా నిలిపివేశాయి. దీన్ని పూర్తి చేసేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.85 కోట్లు మంజూరు చేసింది. పనులు టెండర్‌ దశలో ఉన్నాయి. ఇది పూర్తయితే 107 గ్రామాలకు తాగునీటి సమస్య తీరుతుంది.
► టీడీపీ ప్రభుత్వ హయాంలో కోటవురట్ల మండలంలో కందూరు, జల్లూరు బ్రిడ్జిలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీనీ గాలికొదిలేశారు.
ఇవి చ‌ద‌వండి: ‘ఈనాడు’ రోత రాతలు.. రామోజీ ఇక మారవా?

Read latest Anakapalle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top