సమ్మెకు ఉద్యోగ, ప్రజా సంఘాల మద్దతు | - | Sakshi
Sakshi News home page

సమ్మెకు ఉద్యోగ, ప్రజా సంఘాల మద్దతు

Oct 9 2026 12:56 AM | Updated on Oct 9 2026 12:56 AM

పాడేరు: వైద్యారోగ్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె గురువారం మూడో రోజుకు చేరుకుంది. పట్టణ శివారులోని వీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ ఎదుట టెంట్లు ఏర్పాటు చేసుకుని నిరసన కొనసాగించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 400 మంది ఉద్యోగులు పాల్గొని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి గురువారం పలు ఉద్యోగ, ఎన్‌జీవో సంఘాలతో పాటు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. ఏపీ ఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు సంజీవరావు, ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్‌, ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు శంకర్‌రావు, సుందర్‌రావు, హంసా జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌రావు, కార్యదర్శి చిన్నారావు, జిల్లా హెల్త్‌ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షుడు నాగరాజు తదితరులు నిరసన దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు.ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్ట్‌ వైద్యారోగ్య ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని వారు కోరారు. కాంట్రాక్ట్‌ వైద్యారోగ్య ఉద్యోగుల సంఘం జేఏసీ జిల్లా చైర్మన్‌ గంపరాయి రాంబాబు, జిల్లా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంఘం కోఆర్డినేటర్‌ కొలపరి సురేష్‌బాబు, జేఏసీ నాయకులు మంజుల, అనంత్‌ పాల్గొన్నారు.

రెగ్యులర్‌ చేయాలి

పాడేరు రూరల్‌: వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. గురువారం వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం సరికాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేసి, 100 శాతం గ్రాస్‌ వేతనం చెల్లించాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో భవిష్యత్‌ ఉద్యమాలకు సీఐటీయూ మద్దతు ఇస్తుందని తెలిపారు. సీఐటీయూ నేతలు చిన్నయ్యపడాల్‌, సుందర్‌రావు, పారామెడికల్‌ ఉద్యోగుల సంఘం నాయకులు జోగేంద్ర, రాంబాబు, బాలయ్య, మురళీమోహన్‌, అప్పలస్వామి, ధనలక్ష్మి, లక్ష్మణరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement