భూ సమస్య పరిష్కారంలో జాప్యం | - | Sakshi
Sakshi News home page

భూ సమస్య పరిష్కారంలో జాప్యం

Oct 9 2026 12:56 AM | Updated on Oct 9 2026 12:56 AM

● బాధితుల ఆందోళన

● తహసీల్దార్‌ కార్యాలయం ఎదుటబైఠాయింపు

పెదబయలు: ప్రజల నుంచి ఆర్జీల ద్వారా స్వీకరించే భూ, ఇతర సమస్యలను సత్వరం పరిష్కరించాలని ప్రభుత్వ ఆదేశాలున్నా.. రెవెన్యూ అధికారుల జాప్యంతో సమస్యలు పరిష్కారం కావడం లేదని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబంతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. అరడకోట పంచాయతీ పురుగుడిపుట్టు గ్రామానికి చెందిన కోడ ఆనంద్‌ 2021లో పలాసి లక్ష్మణరావు నుంచి రూ.25 వేలకు మూడు సెంట్ల స్థలాన్ని గ్రామ పెద్దల సమక్షంలో కొనుగోలు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన భార్య చంద్రమ్మకు జగనన్న ఇంటి స్థల పట్టా మంజూరైందని, అదే స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టి లింటల్‌ స్థాయికి తీసుకొచ్చినట్లు చెప్పారు. అయితే స్థలం విక్రయించిన వారే నాలుగు నెలలుగా నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం జూన్‌ 1న పీజీఆర్‌ఎస్‌లో అర్జీ పెట్టినా 127 రోజులు గడిచినా పరిష్కారం కాలేదని బాధితులు తెలిపారు. ఆరు దఫాలుగా అధికారులను కలిసి విన్నవించినా స్పందన లేకపోవడంతో సుమారు అరగంట పాటు కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అర్జీ పరిష్కారంలో జాప్యానికి కారణాలు తెలుపుతూ ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాలని కోరినా స్పందించలేదని ఆరోపించారు. కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై తహసీల్దార్‌ లక్ష్మయ్య మాట్లాడుతూ పురుగుడిపుట్టు గ్రామాన్ని సందర్శించి ఇరువర్గాల వాదనలు తెలుసుకున్నామని తెలిపారు. సమస్యకు పరిష్కార మార్గాన్ని చర్చించుకుని తమకు తెలియజేయాలని ఇరువర్గాలకు సూచించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement