వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ, జనసేన నేతలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ, జనసేన నేతలు

Oct 9 2026 12:56 AM | Updated on Oct 9 2026 12:56 AM

డుంబ్రిగుడ: కూటమి ప్రభుత్వ పాలనపై అసంతృప్తితో కొర్రా పంచాయతీ పెదపాడు గ్రామానికి చెందిన టీడీపీ, జనసేనతో పాటు వివిధ పార్టీలకు చెందిన సుమారు 70 మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య ఆధ్వర్యంలో వీరు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.కూటమి ప్రభుత్వ పాలనతో విసిగిపోయామని, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగన్‌ అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ వైసీపీలో చేరుతున్నామని వారు తెలిపారు. మాజీ వైస్‌ సర్పంచ్‌ వి. కామేశ్వరరావు, గెమ్మెలి కామయ్య, ప్రభాకర్‌, కేశ్వరరావు, కె. బాలరాజు, దసన్న నాయుడు, దామోదర్‌, కొండబాబుతో పాటు సుమారు 70 మందికి రేగం చాణక్య పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురామ్‌, కొర్రా పంచాయతీ మాజీ ఎంపీటీసీ గుజ్జెల విజయ, మాజీ సర్పంచ్‌లు హరి, నాగేశ్వరరావు, మండల నాయకులు తాంగుల రామదాసు, తుమ్నద్‌, పార్టీ ఉపాధ్యక్షుడు గణపతి, మండల కార్యదర్శి మఠం శంకర్‌, యువ నాయకులు విజయదశమి తదితరులు పాల్గొన్నారు.

ఆహ్వానించిన వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement