పాడేరు కలెక్టరేట్‌ వద్ద ఆంక్షలు అప్రజాస్వామికం | - | Sakshi
Sakshi News home page

పాడేరు కలెక్టరేట్‌ వద్ద ఆంక్షలు అప్రజాస్వామికం

Oct 5 2026 12:27 AM | Updated on Oct 5 2026 12:27 AM

పాడేరు రూరల్‌: ప్రజల గొంతు నొక్కడం కోసమే కలెక్టర్‌ ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు పొద్దు బాలదేవ్‌, ధర్మన్న పడాల్‌ తీవ్రంగా ఖండించారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ మేరకు డిమాండ్లు తెలిపారు. జిల్లా కేంద్రం పాడేరులో బహిరంగ సమస్యలపై ఉద్యోగ, ప్రజా, విద్యార్థి సంఘాలు, ప్రజాప్రతినిధులు ఎటువంటి సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు, వివిధ ప్రదర్శనలు నిర్వహించకూడదని కలెక్టర్‌ ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఇకపై ఎటువంటి నిరసనలు, ధర్నాలు ఉన్నా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఐటీడీఏ, కలెక్టరేట్‌ ప్రధాన కార్యాలయాల వద్ద నిర్వహించకూడదని, కేవలం వీఆర్‌ పంక్షన్‌ హాల్‌ ఎదుట ఖాళీ ప్రదేశంలో మాత్రమే చేయాలని ఆదేశాలు జారీ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఎన్నడూ లేనివిధంగా హిట్లర్‌ పాలనను తలపించేలా, నిబంధనలకు విరుద్ధంగా జిల్లా యంత్రాంగం వ్యవహరించడం భావ్యం కాదన్నారు. ప్రజాసంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, రైతుల సమస్యలపై ఐటీడీఏ వద్ద నిరసన తెలిపే హక్కు ఆదివాసీలందరికీ ఉందని స్పష్టం చేశారు. సహజ హక్కులను సైతం కాలరాస్తూ ఆదివాసీలపై అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. గిరిజన ప్రజలపై ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఆంక్షలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆదివాసీలను ఏకం చేసి పెద్దఎత్తున ఉద్యమానికి పిలుపునిస్తామని వారు హెచ్చరించారు.

ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నకూటమి ప్రభుత్వం

ఆదివాసీ గిరిజన సంఘం జిల్లాఅధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుబాలదేవ్‌, ధర్మన్నపడాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement