పేదరికమే గెలుపునకు మెట్లు | - | Sakshi
Sakshi News home page

పేదరికమే గెలుపునకు మెట్లు

Oct 5 2026 12:27 AM | Updated on Oct 5 2026 12:27 AM

● కానిస్టేబుల్‌గా ఎంపికై న సోమశేఖర్‌కు అభినందనల వెల్లువ!

● స్వగ్రామంలో సత్కారం

గూడెంకొత్తవీధి: పేదరికం ఎవరి విజయాన్నైనా ఆపలేదనేదానికి కుందేరి సోమశేఖర్‌ జీవితమే ఒక నిదర్శనం. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, పట్టుదలతో చదివి కానిస్టేబుల్‌గా ఎంపికై న సోమశేఖర్‌ నేటి యువతకు నిజమైన స్ఫూర్తిదాయకమని దామనపల్లి మాజీ సర్పంచ్‌ కె. రామకృష్ణ ప్రశంసించారు. గూడెంకొత్తవీధి మండలం దామనపల్లికి చెందిన సోమశేఖర్‌ నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఎన్నో కష్టాలను ఓర్చి బీటెక్‌ పూర్తి చేసిన ఆయన, లక్ష్యం వైపు అడుగులు వేస్తూ పట్టువదలక ప్రయత్నించి కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించారు. కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసు కుని ఆదివారం ఆయన తన స్వగ్రామం దామనపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, యువకులు ఆయనను చూసి గర్వపడ్డారు. గ్రామస్తులంతా కలిసి సోమశేఖర్‌ను ఘనంగా సన్మానించి, ఆయన విజయాన్ని ఊరంతా పండుగలా జరుపుకున్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ కె. రామకృష్ణ మాట్లాడుతూ...ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపకుండా, కష్టపడితే ఏ రంగంలోనైనా రాణించవచ్చని సోమశేఖర్‌ నిరూపించారు. నేటి యువత ఈయన్ని ఆదర్శంగా తీసుకుని, ఉన్నత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు, సొంతూరికి మంచి పేరు తీసుకురావాలి‘ అని పిలుపునిచ్చారు. ఈ అభినందన కార్యక్రమంలో వీఆర్‌పీ వివేకానందదొర, వీవో బాలరాజు, నాగరాజు, మల్లేష్‌, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సోమశేఖర్‌ను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement