మునగపాక: మండలంలోని తిమ్మరాజుపేట డావెన్సీ అంతర్జాతీయ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి పుట్‌బాల్ పోటీలకు విశేష స్పందన వచ్చింది. మొత్తం 14 టీమ్‌లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. సింహాచలానికి చెందిన బూట్స్ టీమ్‌కు ప్రథమ స్థానం రాగా విశాఖకు చెందిన సిద్దార్ధ టీమ్ ద్వితీయ స్థానం సాధించింది. విజేతలకు పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ కర్రి సుందరయ్య, డైరెక్టర్ రమణాజీలు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శరీర ధారుఢ్యం పెరుగుతుందన్నారు. జిల్లా పుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్, కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి నరేష్‌ల పర్యవేక్షణలో పోటీలు జరిగాయి. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.


