పౌరాణిక కళాకారుడు కోవెల మాస్టారు మృతి | - | Sakshi
Sakshi News home page

పౌరాణిక కళాకారుడు కోవెల మాస్టారు మృతి

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

రాంబిల్లి: దిమిలి గ్రామానికి చెందిన పౌరాణిక, సాంఘిక, జానపద కళాకారుడు, రిటైర్డు ప్రధానోపాధ్యాయుడు కోవెల వెంకటరావు ఆదివారం మృతి చెందారు. ఆయన గత 8 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉపాధ్యాయుడుగా, కళాకారుడుగా ఆయన పేరు సంపాదించారు. వరకట్న వేధింపులు, దేశ భక్తి మేళవింపులతో కట్టుబోలులో శతాబ్దాల క్రితం జరిగిన యధార్ధ ఘటనను బాలసన్యాసమ్మ పేరుతో నాటకాన్ని ఉమ్మడి విశాఖపట్నం , శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఉభయ గోదావరి ఇతర జిల్లాలో ప్రదర్శించారు. ఇందులో ఆయన హీరో చెంచన్న పాత్ర పోషించేవారు. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, సీతారామ కళ్యాణం వంటి పౌరాణిక నాటకాల్లో నటించారు. వెంకటరావు మాస్టారు అంత్యక్రియలు దిమిలిలో నిర్వహించారు. రాంబిల్లి మండల కళాకారుల సంఘం నాయకులు డి.వి. సన్నయ్య తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement