దళితులకు డీ పట్టా భూములు పునరుద్ధరించాలి | - | Sakshi
Sakshi News home page

దళితులకు డీ పట్టా భూములు పునరుద్ధరించాలి

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

రోలుగుంట: దళితులకు డీ పట్టా భూములు పునరుద్ధరణ చేయాలంటూ ఆదివారం రావికమతం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద అందోళన చేశారుజ. దీనికి సారధ్యం వహించిన సీపీఎం జిల్లా ప్రతినిధి కె.గోవింద మాట్లాడుతూ గర్నికం గ్రామానికి చెందిన సాగులో ఉన్న వారి భూములను రెవెన్యూ రికార్డుల్లో గయాలీ భూములుగా మార్చేశారన్నారు. రీ సర్వే జరగక ముందే వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో పట్టాదారుగా సాగుదారుగా నమోదు చేసి ఉన్నారన్నారు. రైతు భరోసా, ఎరువులు, విత్తనాలు , బ్యాంకు రుణాలు పొందే వారిని, రీ సర్వే అయిన తరువాత దళిత గిరిజన భూములను అన్యాయంగా ప్రభుత్వం రికార్డుల నుంచి తొలగించిందన్నారు. వారికి అన్నదాత సుఖీభవ వంటి పథకాలు అందడం లేదన్నారు. బ్యాంకు అధికారులు తీసుకున్న రుణాలు తీర్చలేదని, ఒత్తిడి తీసుకురావడంతో ప్రైవేటు వ్యాపారుల నుంచి అప్పులు తీసుకొని బ్యాంకు రుణాలు చెల్లించామని రుణగ్రస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి రుణాలు ముంజూరు కావాలంటే వన్‌బీ కాపీ ఇస్తేనే రుణాలు మంజూరు అవుతాయని అధికారులు చెబుతున్నారన్నారు. వన్‌బీ రికార్డులో దళితుల పేర్లు లేవని, 2008లో ఇచ్చిన డీ పట్టాలు ఉన్నాయని తెలిపారు. బ్యాంకు అధికారులు రీ సర్వే అయిన తరువాత పట్టాదారు పాస్‌ పుస్తకాలివ్వాలంటున్నారని, కానీ రెవెన్యూ అధికారులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మా భూములు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసి, పట్టాదార్‌ పాస్‌ బుక్‌లు ఇవ్వాలని, లేకుంటే ఆందోళనకు దిగుతామని కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు, కె.వి.పి.ఎస్‌ జిల్లా నాయకుడు సిహెచ్‌.సూరిబాబు, ఎద్దుల కళ్యాణం తదితరులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement