● ఉమ్మడి విశాఖ గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్‌కుమార్
పాడేరు రూరల్: గ్రంథాలయాల్లో ఉద్యోగార్థుల కోసం వివిధ రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వన్నెంరెడ్డి సతీష్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన పాడేరు జిల్లా గ్రంథాలయాన్ని తనిఖీ చేసి, అక్కడి సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత సౌకర్యార్థం ప్రతి గ్రంథాలయంలోనూ పోటీ పరీక్షల సామగ్రిని సమకూరుస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు, యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 6 లక్షల విలువైన పుస్తకాలను కొనుగోలు చేసి నిరుద్యోగులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. జిల్లా గ్రంథాల య సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు, గ్రంథాలయ సిబ్బంది మానస, సత్యవతి, మహేశ్వరరా వు, సత్తిబాబు, సునీత, సుబ్బారావు పాల్గొన్నారు.


