మధ్యాహ్నం : హుకుంపేట మండలం కొంతిలిలో ఎండకు గొడుగులను ఆశ్రయించిన గిరిజనులు
ఉదయం : పాడేరులో దట్టంగా కురుస్తున్నపొగమంచు
సాయంత్రం : పాడేరు పాతబస్టాండ్‌లో కురుస్తున్న వర్షం
విభిన్న వాతావరణానికి వేదికై న పాడేరు మన్యంలో బుధవారం ఒకే రోజు మూడు కాలాలు దర్శనమిచ్చాయి! ఉదయాన్నే దట్టమైన పొగమంచు అలముకోగా.. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ కాసింది. ఆ వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుంచి వర్షం కురిసి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇలా ఒక్క రోజే పొగమంచు, ఎండ, వాన అనుభవంలోకి రావడంతో మన్యం ప్రజలు విభిన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.
– సాక్షి, పాడేరు


