నర్సీపట్నం: నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేశారు. ధరలను తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు అడిరగ్ల రాజు, సాపిరెడ్డి నారాయణమూర్తి, ఇతర నాయకులు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయం పూర్తిగా దెబ్బతినడంతో వ్యవసాయ పనులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇదే క్రమంలో ఉల్లి, పాలు, నూనెలు, పప్పుల ధరలు పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతుందన్నారు. నిత్యావసర ధరలు తగ్గించి, రేషన్ డిపోల ద్వారా సరుకులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. డీజిల్, పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆర్డీవో రమణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సూర్య ప్రభ, చిరంజీవి పాల్గొన్నారు.


