ఎస్.రాయవరం: అడ్డురోడ్డు మనగ్రోమోర్ దుకా ణం నుంచి తరచూ నాసిరకం ఎరువులు, పురుగు మందులు రావడంతో స్థానిక రైతులు బెంబేలెత్తిపోతున్నారు. యూరియాలో మట్టి పెచ్చులు ఎక్కువగా రావడంతో కొరుప్రోలు గ్రామ రైతు చేకూరి శ్రీరామరాజు మంగళవారం వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఏవో సౌజన్య మనగ్రోమోర్ కేంద్రంలో శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఇదే క్రమంలో రెండు నెలల క్రితం గోదావరి కార్బన్ ఎరువు నాసిరకంగా ఉందని, క్రిమి సంహారక మందు పిచికారీతో బెండతోట పాడైందని రైతు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. శాశ్వత చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు.


