అనకాపల్లి: పొట్టకూటి కోసం వచ్చి దారి తప్పి గాయపడిన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన యువకుడిని అతడి కుటుంబ సభ్యులకు పట్టణ పోలీసులు మంగళవారం అప్పగించారు. పట్టణ సీఐ జి.ప్రేమ్‌కుమార్ తెలిపిన వివరాలివి. జార్ఖండ్‌కు చెందిన భీమ్‌కుమార్ మహతో పరవాడ మండలంలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేందుకు తన స్నేహితుడితో ఈ నెల 8న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి, 10న అనకాపల్లి రైల్వేస్టేషన్లో దిగాడు. అక్కడ నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రమాదవశాత్తూ తప్పిపోయాడు. మహతో స్నేహితులు ఈ నెల 14న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేయగా, స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో గాయాలతో లక్ష్మీదేవిపేట సమీపంలో సంచరిస్తున్నట్టు గుర్తించారు. మహతో తలకు తీవ్ర గాయాలు కావడంతో త్వరగా గుర్తించి, తోటి స్నేహితుల సహకారంతో అతడి కుటుంబ సభ్యులకు ఈ నెల 15న అప్పగించామని సీఐ చెప్పారు.
క్షేమంగా కుటుంబ సభ్యులకు
అప్పగించిన పట్టణ పోలీసులు


