చోడవరం: స్థానిక శ్రీస్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేలాది మంది భక్తుల తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉత్సవాలను ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కొడమంచిలి చలపతిరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి తిరువీధి ఉత్సవం ఘనంగా జరిపారు. దేవదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిరణ్మయి, పలువురు ప్రముఖులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరించారు. సంగీత విధ్వాంసుడు రామయ్యరెడ్డి ఆధ్వర్యంలో అన్నమాచార్య సంగీతం పీఠం విద్యార్థులు కీర్తనలు ఆలపించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరస్వామి వారు పసుపు అలంకరణలో భక్తులకు దర్శన మిచ్చారు.


