సాక్షి, పాడేరు: జిల్లా స్వర్ణ గ్రామ ఆదివాసీ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి. ధనుంజయ్, అధ్యక్షుడు పి. సింహాచలం ఆధ్వర్యంలో స్వర్ణ గ్రామ ఆదివాసీ ఉద్యోగులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సి.హెచ్. అనీల్‌కుమార్, టి. ప్రసన్నకుమార్, కోశాధికారిగా పి. సత్యవతి, అధికార ప్రతినిధిగా ఎన్. పద్మారావు, సోషల్ మీడియా ప్రతినిధిగా జే. దామోదర్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్. త్రినాథరావు, టి. మీనాక్షి, ఎల్. మోహన్, కార్యదర్శులుగా పి. మనోజ్‌కుమార్, డి. ప్రవీణ్, జే. బాలకృష్ణ, సహాయ కార్యదర్శులుగా జి. మనోహర్, ఎం. ఇంద్రజ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా అనీల్, వీరయ్య, గణపతి తదితరులు ఎన్నికయ్యారు. స్వర్ణ గ్రామ ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన కార్యవర్గం పనిచేస్తుందని ప్రతినిధులు తెలిపారు.


