అనుమానాస్పదంగా వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

Sep 13 2026 1:00 AM | Updated on Sep 13 2026 1:00 AM

నర్సీపట్నం: మండలంలో అమలాపురం గ్రామానికి చెందిన మాకిరెడ్డి రమణ(38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నెల 11వ తేదీ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గ్రామ సమీపంలోని కాలువ పక్కన రమణ మృతి చెంది ఉండడాన్ని శనివారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు. మృతుడి భార్య భవాని ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ రాజారావు తెలిపారు. మృతదేహన్ని పోస్టు మార్టానికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు సరుగుడు కర్రల వ్యాపారం చేస్తుంటాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement