చోడవరం: వినాయకుడి మాలధారణకు స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 11 రోజుల పాటు మాలధారణ చేస్తారు. ఏటా వేలాది మంది భక్తులు స్వామివారి మాలను ధరిస్తారు. ఈ ఏడాది కూడా మాల ధరించి శనివారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకూ 11 రోజుల పాటు దీక్ష చేపట్టేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. వినాయకుడి మాలధరించి, దీక్ష చేపడితే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకుడు కొడమంచిలి చలపతిరావు ఆధ్వర్యంలో మాలధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. మాలను ధరించిన వారంతా తెల్ల దుస్తులు వేసుకొని ఇక్కడి స్వయంభూ విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు.
కిక్కిరిసిన స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయం


