ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై సుప్రీం తీర్పును అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై సుప్రీం తీర్పును అమలు చేయాలి

Sep 12 2026 12:48 AM | Updated on Sep 12 2026 12:48 AM

తుమ్మపాల: ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్ల అమలులో సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌ గేటు వద్ద నిరసన వ్యక్తం చేసి, జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు రావాడ గణేష్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులు మతం మారిన సందర్భంలో వర్తించే రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిబంధనల ప్రకారం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ మాల కొండయ్య, ప్రాజెక్టు ప్రముఖ్‌ ఎస్‌.సత్యనారాయణ, జిల్లా ప్రచారక్‌ శ్రీను పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement