మట్టి గణపతిని పూజిద్దాం | - | Sakshi
Sakshi News home page

మట్టి గణపతిని పూజిద్దాం

Sep 12 2026 12:48 AM | Updated on Sep 12 2026 12:48 AM

● జేసీ శౌర్యమాన్‌ పటేల్‌

● జేసీ శౌర్యమాన్‌ పటేల్‌

తుమ్మపాల: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించాలని జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌ కోరారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వ ర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీని శుక్రవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఆయన ప్రారంభించి, పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను పర్యావరణహితంగా నిర్వహించాలన్నారు. పర్యావరణ హితమైన గణేష్‌ నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రకృతి, జలవనరులను కాపాడుతూ భక్తిశ్రద్ధలతో పండగను చేసుకోవాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement