అనకాపల్లి: సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయకపోవడం అన్యాయమని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా జేఏసీ చైర్మన్ జయలక్ష్మి అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా నాయకులు జగదీశ్వరి, శోభ, రమేష్, మోహన్, నందకిషోర్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.


