నేడు ‘క్రిటికల్‌ కేర్‌’ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నేడు ‘క్రిటికల్‌ కేర్‌’ ప్రారంభం

Sep 12 2026 12:48 AM | Updated on Sep 12 2026 12:48 AM

అనకాపల్లి: జిల్లాలో రసాయన పరిశ్రమలతోపాటు ఇతర కంపెనీల్లో తరచూ సంభవించే అగ్ని ప్రమాదాల్లో గాయపడే కార్మికులకు, ఉద్యోగులకు అత్యవసర వైద్య సేవల కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి ముస్తాబైంది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రూ.22.5 కోట్లతో అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రి ఎదురుగా 50 పడకలతో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌(ఆస్పత్రి) భవనం మూడు అంతస్తుల్లో నిర్మించారు. అప్పట్లోనే 80 శాతంపైగా పనులు పూర్తయ్యాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండున్నరేళ్ల తర్వాత మిగిలిన పనులు పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

జిల్లాలో అచ్యుతాపురం, పరవాడ, నక్కపల్లి, రాంబిల్లి మండలాల్లో ఎక్కువగా రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో సంభవించే అగ్ని ప్రమాదాల్లో పలువురు మృతి చెందుతున్నారు. గాయపడిన మరి కొంతమందిని విశాఖ సిటీలో కార్పొరేట్‌ ఆస్పత్రులకు తరలించే క్రమంలో కొంతమంది మార్గమధ్యంలో మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లిలో క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లయితే వారికి సకాలంలో వైద్యసేవలు అందించినట్లయితే ప్రాణాలు కాపాడవచ్చు. ఈ విషయమై 2023 డిసెంబర్‌లో అప్పటి సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఎంపీ బీవీ సత్యవతి, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, జిల్లా అధికారులు అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కోరగా క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ నిర్మాణానికి రూ.22.3 కోట్లు విడుదల చేశారు. 2024 ఫిబ్రవరిలో అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రి ఎదురుగా ప్రభుత్వ స్థలంలో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో ప్రారంభమైన పనులు 80 శాతం పూర్తయ్యాయి. తొలి ఏడాది కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో వైద్య సిబ్బందికి జీతాలు చెల్లిస్తుంది. రెండో ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తుంది.

క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లో వైద్యం...

గుండెపోటు, శ్వాసకోశ వైఫల్యం, తీవ్రమైన గాయాలైన వారికి ఇక్కడ వైద్య సేవలందిస్తారు. 24 గంటలు నిపుణులైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందిస్తారు.

గ్రౌండ్‌ ఫ్లోర్‌ :

డిలేసిస్‌ (4 పడకలు), డాక్టర్‌ రూమ్‌, డోనింగ్‌, డీయూ ఎంసీహెచ్‌(2 పడకలు), ఎల్‌డీఆర్‌ (ఒక్కొక్కరికి 1 బెడ్‌), డోనింగ్‌ ఫిమెల్‌, ఆర్‌వో డయాలైజర్‌, అల్ట్రా సౌండ్‌, ప్లాస్టర్‌ రూమ్‌, పీఓసీ ల్యాబ్‌, ఎలక్ట్రికల్‌ రూమ్‌, డ్యూటీ డాక్టర్‌/ఎగ్జామినేషన్‌ రూమ్‌, ఎమర్జెన్సీ వార్డ్‌ (6 పడకలు), మైనర్‌ ప్రొసీజర్‌, నర్సుల రూమ్‌, ఇంజెక్షన్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌, మరుగుదొడ్లు...

మొదటి అంతస్తు:

ఐఎస్‌ఓ రూమ్‌ (2 పడకలు), డైనింగ్‌ మెల్‌ –2 నంబర్లు, డీయూ, ఏఎస్‌వో వార్డు (6 పడకలు), క్లినికల్‌ టెస్ట్‌, ఐఎస్‌వో వార్డు (15 పడకలు), కౌన్సెలింగ్‌ రూమ్‌లు–2 నోస్‌, డౌఫింగ్‌, ఐసీయూ–ఐఎస్‌ఓ స్టోర్‌, డీఆర్‌ డ్యూటీ, స్టాఫ్‌ రూమ్‌, ఐఎస్‌వో వార్డ్‌ –2 నంబర్లు (ఒక్కొక్కటి 2 బెడ్లు) మరుగుదొడ్లు ఉంటాయి.

రెండవ అంతస్తు:

హెచ్‌డీయూ(6 బెడ్లు), డీయూ, అనస్థీషియా రూమ్‌, అటెండెంట్‌ వెయిటింగ్‌, ఐసీయూ(10 బెడ్లు), ఓటీలు– 2 నంబర్లు, స్టెరిలైజేషన్‌, ఎలక్ట్రికల్‌ రూమ్‌, ఈక్యూఎంటీ రూమ్‌, ఫ్రీ అండ్‌ ఫోస్ట్‌ ఓపీ– 5 బెడు,్ల డీఆర్‌ డ్యూటీ, స్టాఫ్‌ నర్సులు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి.

వాహనాలు పార్కింగ్‌కు ప్రత్యేక సౌకర్యాలు...

క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌కు ఎదురుగా వాహనాలు నిలుపుదల చేసేందుకు ఎక్కువగా పార్కింగ్‌ స్థలం ఉంది. రోగితో పాటు రోగి బంధువులు ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

50 పడకల క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రిని ఎంపీ సీఎం రమేష్‌, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శనివారం ప్రారంభిస్తారని ఎన్టీఆర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రవికుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

వైఎస్సార్‌సీపీ పాలనలోరూ.22.5 కోట్లతో నిర్మాణం

50 పడకలతో అత్యవసర రోగులకు వైద్యం

అందుబాటులోకి రానున్న

కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement