గణితంపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

గణితంపై దృష్టి సారించాలి

Sep 12 2026 12:48 AM | Updated on Sep 12 2026 12:48 AM

డీఈవో నాగేశ్వరరావు

నక్కపల్లి: అన్ని పాఠశాలల్లో విద్యార్థులు చదవడం, రాయడంతో పాటు గణితంలో ప్రాథమిక అంశాలపై దృష్టిసారించాలని జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు అన్నారు. చినదొడ్డిగల్లు జెడ్పీ ఉన్నతపాఠశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పదోతరగతి విద్యార్థులతో మాట్లాడి, అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం బోధన జరుగుతోందా, లేదా అనే విషయాన్ని పరిశీలించారు. పదోతరగతి విద్యార్థులతోపాటు మిగిలిన తరగతుల విద్యార్థులను రైజింగ్‌స్టార్‌, షైనింగ్‌స్టార్లుగా విభజించి మెరుగైన ఫలితాలు వచ్చేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠ్యాంశాల బోధనకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ ఏడాది అన్ని పాఠశాలల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయుడు ప్రత్యేకంగా మానటరింగ్‌ చేసి ఫీడ్‌ బ్యాక్‌ డీఈవో కార్యాలయానికి ఎప్పటికప్పుడు పంపించాలన్నారు.పాఠశాలలో గ్రీన్‌ యాక్టవిటీ గురించి హెచ్‌ఎం బాలాజీని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి దశ నుంచే పర్యావరణ విలువ తెలియజేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement