కశింకోట: స్థానిక బాలికల జిల్లా పరిషత్ హైస్కూల్‌లో శుక్రవారం మండల స్థాయి చెకుముకి పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పోటీలకు హాజరై, తమ ప్రతిభను ప్రదర్శించారు.కశింకోట డీపీఎన్ జెడ్పీ హైస్కూలు, ప్రైవేటు సెయింట్ జాన్స్ స్కూలు విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా ఎంఈవో రమణశ్రీ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెరగాలని, సైన్స్‌ను అర్థం చేసుకోవాలన్నారు. పాఠశాల హెచ్‌ఎం ఎం.ఎస్. స్వర్ణకుమారి మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలంటే ఇటువంటి పోటీల్లో అందరూ పాల్గొవాలని కోరారు. జిల్లా సైన్స్ అధికారి దాడి కాళిదాసు మాట్లాడుతూ విద్యార్థులు అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని శాస్త్రవేత్తలు కావడానికి కృషి చేయాలన్నారు. భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు కేశవరావు మాట్లాడుతూ విద్యార్థులు మూఢ నమ్మకాలను విడనాడాలన్నారు. జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు ఎం.ఎస్.వి.ఎస్.పి. వర్మ తదితరులు పాల్గొన్నారు.


