పట్టుబడిన గంజాయి నింధితులతో డిఎస్పీ శ్రీనివాసరావు, సీఐ గపూర్
నర్సీపట్నం : బైక్‌పై రవాణా చేస్తున్న రూ.27.70 లక్షలు విలువైన లిక్విడ్ గంజాయిని నర్సీపట్నం టౌన్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు అందించిన వివరాలివి. పెదబొడ్డేపల్లి జంక్షన్ వద్ద సీఐ ఎస్.కె.గపూర్, ఎస్‌ఐ రమేష్ సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తున్నారు. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి 2 కిలోల లిక్విడ్ గంజాయిని బైక్‌పై తీసుకువస్తూ యువతి, యువకుడు పోలీసులకు పట్టుబడ్డారు. కొయ్యూరు మండలం, డొకురాయి గ్రామానికి పాంగి శివ(25), కిత్తాబ్ గ్రామానికి మర్రి ఇందు(20) అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. గంజాయి అమ్మిన వ్యక్తిని అరెస్టు చేస్తామన్నారు. నిందితుల దగ్గర నుంచి రెండు సెల్‌ఫోన్లు, బైక్ సీజ్ చేశామన్నారు.


