కానిస్టేబుల్ విజయను సత్కరించిన సీఐ వినోద్‌బాబు, సిబ్బంది
పాయకరావుపేట : రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడా పోటీల్లో స్థానిక పోలీసు కానిస్టేబుల్ విజయ ఆరు స్వర్ణ పతకాలను సాధించినట్టు సీఐ ఎం.వినోద్‌బాబు తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ఈనెల ఒకటి నుంచి 4 వ తేదీ వరకు అమరావతిలో నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొని, 5 వేల మీటర్లు, 1500 మీటర్లు, 800 మీటర్లు, 400 మీటర్లు రన్నింగ్, కబడ్డీ, ఖో ఖో పోటీల్లో విజయ ఆరు విభాగాలల్లో ప్రథమ స్థానాలు సాధించి స్వర్ణ పతకాలు సాధించిందన్నారు. పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ క్రీడా పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకాలు సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ మేరకు కానిస్టేబుల్ వి.విజయను సీఐ ఎం.వినోద్‌బాబు, ఎస్‌ఐ పురుషోత్తం, పోలీసు సిబ్బంది ఘనంగా సత్కరించారు.


